వాల్తేరు వీరయ్య.. 'బాస్ పార్టీ'కి ముహూర్తం కుదిరింది
on Nov 20, 2022

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ మెగాస్టార్ ని స్క్రీన్ పై చూడబోతున్నామంటూ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చింది.
గతంలో మెగాస్టార్ కి ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి 'బాస్ పార్టీ' అంటూ సాగే అదిరిపోయే మాస్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ఇటీవల మూవీ తెలిపింది. తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించింది. 'బాస్ పార్టీ' సాంగ్ ని నవంబర్ 23న సాయంత్రం 4:05 కి విడుదల చేయబోతున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ ని వదిలారు. అందులో లుంగీ కట్టుకొని స్టెప్ వేస్తున్న మెగాస్టార్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ తోనే ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉండబోతుందని చెప్పేశారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నాడు. 2023 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



