సమంత ఖాతాలో మరో విజయం
on Nov 20, 2022

సమంత తాజా చిత్రం 'యశోద' హిట్ స్టేటస్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.11.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో బ్రేక్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి తొమ్మిది రోజుల్లో రూ.7.35 కోట్ల షేర్ రాబట్టింది యశోద. తమిళనాడులో రూ.1 కోటి షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.1.10 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.2.52 కోట్ల షేర్ కలిపి ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో రూ.11.97 కోట్ల షేర్ వసూలు చేసిందని అంచనా. అంటే పదోరోజు(ఆదివారం) నుంచి యశోదకు వచ్చే కలెక్షన్లు లాభాలు అన్నమాట.
అయితే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.10.20 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ నైజాంలో రూ.3.72 కోట్ల షేర్(బిజినెస్ రూ.4 కోట్లు), సీడెడ్ లో రూ.0.71 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.20 కోట్లు), ఆంధ్రాలో రూ.2.92 కోట్ల షేర్(బిజినెస్ రూ.5 కోట్లు) తో ఇప్పటిదాకా రూ.7.35 కోట్ల షేర్ వసూలు చేసింది. రేపటికల్లా నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశమున్నా.. సీడెడ్, ఆంధ్రాలో మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం భారీ సినిమాల విడుదల లేకపోవడం యశోదకు కలిసొచ్చే అంశం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



