'ఎన్టీఆర్ 30' మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి
on Nov 20, 2022

'ఎన్టీఆర్ 30' సినిమాకి సంబంధించిన లాంచ్, షూటింగ్ అప్డేట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ టీమ్ మాత్రం ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని ప్రకటించి సరిపెట్టింది. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది.
ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కొరటాల చర్చిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



