వివేక్ అగ్నిహోత్రి 'వార్' రామ్ చరణ్ తోనేనా?
on Nov 8, 2022

'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకొని దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి సినిమా టైటిల్ ని గెస్ చేయాలంటూ నెటిజన్లకు టాస్క్ ఇచ్చారు. దీంతో ఆ సినిమా టైటిల్ గురించి, ఆ సినిమాలో నటించబోయే హీరో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో తాను చేయబోయే తదుపరి సినిమా టైటిల్ ని గెస్ చేయాలంటూ తాజాగా సోషల్ మీడియాలో వివేక్ అగ్నిహోత్రి ఒక ఫోటోని పంచుకున్నారు. అందులో 'ఖాళీని పూరించండి' అంటూ ''the ____ war" అని రాసుంది. దీంతో పలువురు నెటిజన్లు ఖాళీని పూరించి, టైటిల్ ని కనిపెట్టే పనిలో పడిపోయారు.
ఇదిలా ఉంటే దర్శకులు సుకుమార్, వివేక్ అగ్నిహోత్రితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ఇటీవల అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ ముగ్గురూ చేతులు కలిపింది రామ్ చరణ్ ప్రాజెక్ట్ కోసమనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మరి ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి చేస్తున్న ఈ వార్ మూవీలో రచయితగా లేదా నిర్మాతగా సుకుమార్ భాగమవుతాడేమో తెలియాల్సి ఉంది. ఒకవేళ సుకుమార్ భాగమైతే.. ఇందులో రామ్ చరణ్ నటించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి వివేక్ అగ్నిహోత్రి 'వార్' చరణ్ తో ఉంటుందో లేక మరెవరితోనైనా ఉంటుందో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



