ప్రభాస్ ఫ్యాన్స్ కి 'వర్షం'.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 'బాద్ షా'
on Nov 9, 2022

టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు 'పోకిరి'తో ఇది పీక్స్ కి వెళ్ళింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు విడుదలయ్యాయి. ఇవి బిగ్ హిట్స్ కాకపోయినా బోలెడంత ఫ్యాన్ స్టఫ్ ఉండటంతో అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రీరిలీజ్ ల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటిదాకా ప్రభాస్ నటించిన రెండు సినిమాలను రీరిలీజ్ చేశారు. అందులో ఒకటి ఫ్లాప్ మూవీ 'రెబల్' కాగా, రెండోది యావరేజ్ మూవీ 'బిల్లా'. 'ఛత్రపతి' లాంటి బ్లాక్ బస్టర్ ని వదిలేసి ఈ సినిమాలను రీరిలీజ్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ తెలుగు తెరకు పరిచయమై 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సూపర్ హిట్ ఫిల్మ్ 'వర్షం'ని నవంబర్ 11న భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. దీనికోసం కొందరు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరికొందరు మాత్రం ఏదైనా మాస్ సినిమా రీరిలీజ్ చేస్తేనే ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'ఆది', 'సింహాద్రి' వంటి సినిమాల రీరిలీజ్ ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నవంబర్ మూడో వారంలో 'ఆది' రీరిలీజ్ ఉంటుందని ఇప్పటికే ప్రకటన రావడంతో వాళ్ళు ఎంతో సంబరపడ్డారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు 'బాద్ షా' మూవీ తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 19న రీరిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది సూపర్ హిట్ మూవీ అయినప్పటికీ ఈ నిర్ణయం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. ఎన్టీఆర్ కెరీర్ లో 'ఆది', 'సింహాద్రి' లాంటి ఎన్నో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునే మాస్ సినిమాలు ఉండగా, 'బాద్ షా'ని ఎంపిక చేయడంపై వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా 'సాంబ', 'యమదొంగ', 'టెంపర్' వంటి సినిమాలు వేసినా బాగుటుందని అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



