'ధమ్కీ' కోసం మరోసారి జతకట్టిన విష్వక్‌సేన్-నివేదా పేతురాజ్
on Mar 9, 2022

విష్వక్‌సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ' అనే సినిమా మొదలైంది. 'పాగల్' ఫేమ్ నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. 'పాగల్' మూవీలో విష్వక్‌తో తొలిసారి జతకట్టిన నివేదా పేతురాజ్.. మరోసారి ఈ మూవీలో ఆయన సరసన నటిస్తోంది. వన్మయీ క్రియేషన్స్, విష్వక్‌సేన్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. కెప్టెన్ రాజు నిర్మాత.
బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్‌లో జరిగాయి. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి దినేశ్ కె బాబు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

'పాగల్' మూవీలో విష్వక్, నివేదా మధ్య కెమిస్ట్రీని ఆడియెన్స్ ఎంజాయ్ చేశారు. అందుకే 'ధమ్కీ'లో తన సరసన మరోసారి ఆమెను నాయికగా విష్వక్ ఎంచుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తోన్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' విడుదలకు సిద్ధమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



