ప్రభాస్ తో గొడవపై స్పందించిన పూజా హెగ్డే
on Mar 9, 2022

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజ మధ్య విభేదాలు వచ్చాయని.. ప్రస్తుతం వీరి మధ్య మాటల్లేవని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై పూజ స్పందించింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది.
షూటింగ్ లో పూజ తీరు నచ్చక ప్రభాస్ క్లాస్ పీకాడని, అప్పటి నుంచి వీరి మధ్య మాటలు లేవని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్ లోనూ వీరిద్దరూ అంతగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన పూజ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది.
షూటింగ్ లో తామిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళమని పూజ తెలిపింది. తనతో పాటు తన తల్లికి కూడా ప్రభాస్ ప్రత్యేకంగా భోజనం పంపేవాడని చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా మంచి మనిషి అని, అంత మంచి మనిషితో తానే కాదు ఎవరైనా సరే మాట్లాడకుండా ఉండలేరు అంటూ ప్రభాస్ పై పూజ ప్రశంసల వర్షం కురిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



