ఏపీ సీఎంకి థాంక్స్.. తెలంగాణ సీఎంకి బిగ్ థాంక్స్
on Mar 9, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. టికెట్ ధరలు పెరగడంతో పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కొందరు మాత్రం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్యని సృష్టించి, ఏదో గొప్ప పని చేసినట్లు మళ్ళీ చప్పట్లు కొట్టించుకోవడం ఏంటంటూ ప్రభుత్వం తీరుని తప్పుబడుతున్నారు. అయితే ఏది ఏమైనా ఫైనల్ గా సినీ పరిశ్రమకు మంచి జరిగితే చాలని కొందరు సంతృప్తి పడుతున్నారు.
టికెట్ ధరలు పెంచాలంటూ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లి అభ్యర్ధించారు. కాస్త ఆలస్యంగా కరుణించిన ఆయన.. రీసెంట్ గా కొత్త జీవో ఇచ్చారు. దీంతో జగన్ ని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ చిరంజీవి, మహేష్ వంటి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, వాళ్ళే సాల్వ్ చేసి, వాళ్ళే థాంక్స్ లు చెప్పించుకుంటున్నారు అంటూ కొందరు సినీ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్స్ ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై రాజమౌళి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
ఏపీలో టికెట్ ధరలను పెంచుతూ జీవో ఇచ్చినందుకు సీఎం జగన్ కి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణలో పెద్ద సినిమాలకు ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి రాజమౌళి బిగ్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు తమకి మద్దతుగా నిలుస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
.webp)
నిజానికి ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో సినిమా వారికి పెద్దగా సమస్యలు లేవు. టికెట్ ధరలు కావాల్సిన దానికంటే ఎక్కువే పెంచారు. ఐదు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన 'భీమ్లా నాయక్'కి కూడా తెలంగాణలో ఐదు షోలకు అనుమతి వచ్చింది. ఎటొచ్చి ఏపీలోనే టికెట్ ధరలు, స్పెషల్ షో వంటి సమస్యలు ఉన్నాయి. తాజాగా టికెట్ ధరలు పెంచిన జగన్ సర్కార్.. ఐదో షోకి కూడా అనుమతి ఇచ్చింది కానీ.. అందులో ఒక షో తక్కువ బడ్జెట్ సినిమాలకి కేటాయించాలని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో 'ఏపీ సీఎంకి థాంక్స్', 'తెలంగాణ సీఎంకి బిగ్ థాంక్స్' చెబుతూ రాజమౌళి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



