'దళపతి 67'లో విశాల్, నివిన్ పాలీ!
on Nov 2, 2022

విజయ్ హీరోగా నటించే 'దళపతి 67' మూవీ కోసం సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లన్నీ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విశాల్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. విశాల్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'మార్క్ ఆంథోని' లొకేషన్‌లో అతడిని లోకేష్ కలిసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
'దళపతి 67'లో విశాల్ భాగమని కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మలయాళం స్టార్ యాక్టర్, 'ప్రేమమ్' హీరో నివిన్ పాలీ కూడా ఈ సినిమాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ 'విక్రమ్' తర్వాత లోకేశ్ రూపొందిస్తోన్న చిత్రం 'దళపతి 67'. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మరో మలయాళీ యువ నటుడు మాథ్యూ థామస్ కూడా ఈ సినిమాలోకి రాబోతున్నట్లు కథనాలు వచ్చాయి.
ఏది ఏమైనా 'విక్రమ్' తరహాలో ఈ సినిమాలోనూ భారీ తారాగణం ఉంటుందనేది ఖాయం. విజయ్-లోకేశ్ కాంబినేషన్‌లో వచ్చిన మునుపటి మూవీ 'మాస్టర్'. 'దళపతి 67'లో త్రిష, కీర్తి సురేశ్‌లు కథానాయికలుగా నటిస్తారని కూడా వార్తలు వచ్చాయి. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమాగా రూపొందనుంది. కాగా విజయ్ లేటెస్ట్ ఫిల్మ్ 'వారిసు' (తెలుగులో 'వారసుడు') వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానున్నది. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



