ఎన్టీఆర్ సంస్కారానికి కర్ణాటక ఫిదా!
on Nov 2, 2022

కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి 'కర్ణాటక రత్న' పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తితో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన తీరుకి, ఆయన సంస్కారానికి కన్నడ వాసులు ఫిదా అయ్యారు.
ఈ కార్యక్రమం జరుగున్న సమయంలో వర్షం పడటంతో వేదికపైన ఉన్న కుర్చీలు తడిచిపోయాయి. పురస్కారాన్ని అందుకోవడానికి పునీత్ భార్య అశ్విని వేదికపైకి రాగా.. అప్పటికే వేదికపైన ఉన్న ఎన్టీఆర్ లేచి, స్వయంగా కుర్చీని క్లీన్ చేసి ఆమెను కూర్చోబెట్టాడు. అలాగే ఆ పక్కన ఉన్న మరో కుర్చీని కూడా క్లీన్ చేసి సుధామూర్తిని కూర్చోమని చెప్పి, ఆయన వేరే కుర్చీలో కూర్చున్నాడు. అంతేకాకుండా సుధామూర్తి వర్షంలో తడుస్తుంటే ఆమెకు గొడుకు పట్టమని పక్కనున్న వారికి చెప్పాడు. మహిళల పట్ల, పెద్దవారి పట్ల ఎన్టీఆర్ చూపిన గౌరవంపై ప్రశంసలు కురుస్తున్నాయి. స్టార్ హీరో అయినప్పటికీ ఏ మాత్రం అహం లేకుండా ఇంత సింప్లిసిటీతో ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలో పుట్టిన పెరిగిన వాడిలా స్పష్టంగా కన్నడ మాట్లాడటం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోతున్నారు. పునీత్ గొప్ప మనసున్న వ్యక్తి అని, ఈ వేడుకకు తాను ఒక స్నేహితుడిగా వచ్చానని ఎన్టీఆర్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



