'విరాట పర్వం' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే?
on Jun 16, 2022

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విరాట పర్వం' ఒకటి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకొని రేపు(జూన్ 17న) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో 'విరాట పర్వం' సినిమా రూ.11 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. నైజాం(తెలంగాణ)లో 4 కోట్లు, సీడెడ్(రాయలసీమ)లో 2 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 1 కోటి, ఓవర్సీస్ లో 2 కోట్ల బిజినెస్ చేసిన మూవీ.. వరల్డ్ వైడ్ గా 14 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది.
పాజిటివ్ టాక్ వస్తే విరాట పర్వం సులభంగానే బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశముంది. విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3-4 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



