ఏ క్లాస్ అనే విషయం నాకు ఇప్పటికీ తెలీదు
on Jun 16, 2022

సాయి పల్లవి హీరోయిన్స్ అందరిలోకి సంథింగ్ డిఫరెంట్. తనకు నచ్చింది చేస్తుంది. సినిమా కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తుంది. రెమ్యూనరేషన్ విషయాన్ని కూడా పట్టించుకోదు. ఈరోజున స్మాల్ స్క్రీన్ ఐనా బిగ్ స్క్రీన్ ఐనా రెమ్యూనరేషన్ ఎంత అని చూసే యాక్టర్స్ ఉన్నారు కానీ సాయి పల్లవి లాంటి వాళ్ళను మాత్రం చాలా అరుదుగా చూస్తాం. పల్లవిని చిన్నప్పటి నుంచి తనను ఒక రాణిలా పెంచారు ఆమె పేరెంట్స్. డబ్బు ఇంపార్టెంట్ అనేలా నన్ను పెంచలేదు. అందుకే నాకు ఇప్పటికీ తెలీదు ఎవరు హైక్లాస్, లోక్లాస్, మిడిల్ క్లాస్ అని . ఏమన్నా అవసరం ఉంటే అది నిజంగా అవసరమా కాదా అని అడుగుతారు. అవసరం అనుకుంటే కొందాం లేదంటే లేదు .డబ్బు ఉంది కదా అని వేస్ట్ చేయకూడదు అని చెప్తారు.
నేను కూడా అలానే ఆలోచిస్తాను, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. ఇది నాకు మా పేరెంట్స్ నేర్పించారు అలాగే ఫాలో అవుతున్న. పడి పడి లేచే మనసు హిట్ టాక్ రాలేదని డైరెక్టర్ నాకు డబ్బులు తిరిగి ఇచ్చేసారు. అమ్మ ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వొద్దు అని చెప్పింది. కానీ కష్టపడి చేసినందుకు ఇస్తున్నాం అని చెప్పి కొద్ది రోజులు తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేశారని చెప్పింది పల్లవి. ఇక సినిమాల్లో నా కేరెక్టర్ పార్ట్ వరకు చదివేసుకుని వెళ్లి ఆక్ట్ చేసి వచ్చేయను. మొత్తం అందరి పార్ట్స్ చదివితేనే నేను ఏం చేయాలో నాకు తెలుస్తుంది అంటూ తన వర్క్ పట్ల తనకు ఉన్న డెడికేషన్ ని చాలా క్లారిటీ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



