భారీ నష్టాల దిశగా 'అంటే సుందరానికీ'!
on Jun 16, 2022

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ' కలెక్షన్స్ రోజురోజుకి డ్రాప్ అవుతున్నాయి. జూన్ 10న విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ అయ్యేసరికి బయ్యర్లకు కనీసం రూ.10 కోట్ల నష్టం మిగిల్చే అవకాశముందని అంటున్నారు.
ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల బిజినెస్ చేసిన 'అంటే సుందరానికీ' ఆరు రోజుల్లో 50 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది. తెలుగు స్టేట్స్ లో మొదటి మూడు రోజులు 3.87 కోట్లు, 3.48 కోట్లు, 3.05 కోట్ల షేర్ తో పర్వాలేదు అనిపించుకున్న ఈ మూవీ.. నాలుగో రోజైన సోమవారం నుంచి దారుణంగా పడిపోయింది. నాలుగో రోజు 71 లక్షలు, ఐదో 46 లక్షలు, ఆరో రోజు 30 లక్షలు మాత్రమే రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఆరు రోజుల్లో 11.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆరు రోజుల్లో నైజాంలో 5.43 కోట్లు(బిజినెస్ 10 కోట్లు) , సీడెడ్ లో 1.13 కోట్లు(బిజినెస్ 4 కోట్లు) , ఆంధ్రాలో 5.31 కోట్ల షేర్(బిజినెస్ 10 కోట్లు) మాత్రమే రాబట్టి ఏ ఏరియాలోనూ బ్రేక్ ఈవెన్ కి చేరువ కాలేకపోయింది.
ఇక వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ ఈ మూవీ ఇప్పటిదాకా దాదాపు 60 శాతం రికవరీ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 17.97 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 12-13 కోట్ల దూరంలో ఉంది.
ఇప్పటికే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. దానికి తోడు రేపటి నుంచి 'విరాట పర్వం', 'గాడ్సే' వంటి సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా 'విరాట పర్వం' కారణంగా కలెక్షన్స్ మరింత పడిపోయే అవకాశముంది. దాంతో 'అంటే సుందరానికీ' 10 కోట్లకు పైగా నష్టం చూసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



