తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. కోటి కూడా రాబట్టలేకపోయిన 'విరాటపర్వం'!
on Jun 18, 2022

సాయిపల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా వేణు ఊడుగుల రూపొందించిన 'విరాటపర్వం' చిత్రం ఊహించిన దానికంటే అతి తక్కువ ఓపెనింగ్స్‌తో నిరాశపర్చింది. మౌత్ టాక్ బాగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎందుకనో తొలిరోజు ఈ వెన్నెల ప్రేమకథను చిన్నచూపు చూశారు. అందుకే ఫస్ట్ డే 'విరాటపర్వం' రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్‌ను కూడా సాధించలేక షాక్‌కు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు కేవలం రూ. 90 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రలో రూ. 35 లక్షల షేర్ వసూలు చేసిన 'విరాటపర్వం'కు రాయలసీమలో రూ. 7 లక్షలు, తెలంగాణలో రూ. 48 లక్షల షేర్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 11 కోట్లుగా అంచనా వేశారు. అంటే తొలి రోజు రికవర్ అయ్యింది కేవలం 8 శాతమే. విడుదలకు ముందు మంచి ప్రచారమే లభించినప్పటికీ, అది కలెక్షన్లలో ప్రతిఫలించలేదు.
వరల్డ్‌వైడ్‌గా చూస్తే.. 'విరాటపర్వం' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 14 కోట్లు. తొలిరోజు వచ్చింది రూ. 1.42 కోట్లు. అంటే రికవరీ శాతం 10. ఓవర్సీస్‌లో రూ. 40 లక్షల షేర్ వచ్చింది. దేశంలోని మిగతా ప్రాంతం నుంచి రూ. 12 లక్షలు కలెక్టయ్యాయి.
సాయిచంద్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, ప్రియమణి, నవీన్‌చంద్ర, నందితా దాస్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీత దర్శకునిగా, డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్లుగా వర్క్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



