రాశీ ఖన్నా, అవికా గోర్.. సేమ్ టు సేమ్!
on Jun 18, 2022

అందాల తారలు రాశీ ఖన్నా, అవికా గోర్.. తమ తమ కొత్త చిత్రాలతో ఒకే బాటలో పయనిస్తున్నారు. అదెలాగంటే.. ఈ ఇద్దరు కూడా జూలై ప్రథమార్ధంలో రెండు వరుస వారాల్లో రెండేసి సినిమాలతో సందడి చేయనున్నారు. అందులో ఒకటి.. వారిద్దరి కాంబినేషన్ మూవీనే కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. `జిల్`, `ఆక్సిజన్` తరువాత మ్యాచో స్టార్ గోపీచంద్ కాంబినేషన్ లో రాశీ ఖన్నా నటించిన చిత్రం `పక్కా కమర్షియల్`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈ కోర్ట్ రూమ్ కామెడీ డ్రామా.. జూలై 1న రిలీజ్ కానుంది. ఇక అదే రోజున `ఒకరికి ఒకరు` ఫేమ్ శ్రీరామ్ తో కలిసి అవికా గోర్ నటించిన `టెన్త్ క్లాస్ డైరీస్` విడుదల కానుంది. ఈ చిత్రంతో `గరుడవేగ` అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కట్ చేస్తే.. జూలై 8న యువ సామ్రాట్ నాగచైతన్యకి జంటగా రాశీ ఖన్నా, అవికా గోర్ నటించిన `థాంక్ యూ` సందడి చేయనుంది. `దిల్` రాజు నిర్మాణంలో వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మరి.. ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో రాశీ ఖన్నా, అవికా గోర్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



