ఆగస్టు రెండో వారంలో మహతి బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
on Jun 18, 2022

మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడిగా స్వరంగేట్రం చేశాడు మహతి స్వర సాగర్. `ఛలో`, `భీష్మ` చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేయడమే కాకుండా.. విజయాలనూ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ కంపోజర్ చేతిలో పలు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న `భోళా శంకర్` కూడా ఉంది.
ఇదిలా ఉంటే.. 2022 ఆగస్టు రెండో వారం మహతి స్వర సాగర్ కి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ వారంలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో పలకరించనున్నాడు మహతి. ఆ చిత్రాలే.. `మాచర్ల నియోజక వర్గం`, `స్వాతి ముత్యం`. యూత్ స్టార్ నితిన్, క్యూట్ బ్యూటీ కృతి శెట్టి జంటగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి రూపొందిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `మాచర్ల నియోజక వర్గం` ఆగస్టు 12న రిలీజ్ కానుండగా.. బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా లక్ష్మణ్ ఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న `స్వాతి ముత్యం` ఆగస్టు 13న విడుదలకు సిద్ధమైంది. మరి.. నూతన దర్శకుల కాంబోలో మహతి నుంచి వస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్.. తనకి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని అందిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



