'ద ఫ్యామిలీ మ్యాన్ 3'లో విజయ్ సేతుపతి?
on Jun 20, 2021
.jpg)
ఓటీటీ వేదికగా సందడి చేసిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1' ఎలాగైతే విశేషాదరణ పొందిందో.. అదే విధంగా రీసెంట్ గా స్ట్రీమ్ అవుతున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కూడా దిగ్గజ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ వేదికగా అమేజింగ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రాజ్ - డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ కి త్వరలో మూడో సీజన్ కూడా రాబోతోంది.
ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. సీజన్ 2కి ఎలాగైతే సమంత హైలైట్ గా నిలిచిందో.. అలాగే సీజన్ 3కి సేతుపతి ప్రధాన ఆకర్షణ కానున్నట్లు టాక్. వాస్తవానికి సీజన్ 2లో శ్రీలంకలోని తమిళ నాయకుడి పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతినే సంప్రదించారట రాజ్ అండ్ డీకే. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రతిపాదనకు నో చెప్పారట సేతుపతి.
కట్ చేస్తే.. ఇప్పుడు మూడో సీజన్ లో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా.. ఈ సారి మక్కల్ సెల్వన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కోలీవుడ్ బజ్. త్వరలోనే సీజన్ 3లో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. సీజన్ 1, సీజన్ 2 తరహాలో సీజన్ 3 కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



