'ఎఫ్ 3'లో ప్రగ్యా జైశ్వాల్?
on Jun 20, 2021
'కంచె'(2015)తో తెలుగునాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైశ్వాల్. ఒకవైపు యువ కథానాయకుల సరసన అలరిస్తూనే.. మరోవైపు సీనియర్ స్టార్స్ తోనూ కనువిందు చేస్తోందీ ముద్దుగుమ్మ. ఆ మధ్య 'ఓం నమో వేంకటేశాయ' (2017)లో కింగ్ నాగార్జునకి జంటగా దర్శనమిచ్చిన ప్రగ్యా.. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణకి జోడీగా 'అఖండ'లో నటిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే మరో అగ్ర కథానాయకుడి చిత్రంలో సందడి చేసే అవకాశం దక్కించుకుందట మిస్ జైశ్వాల్.
ఆ వివరాల్లోకి వెళితే.. 2019 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' పేరుతో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా.. వారికి జంటగా తమన్నా, మెహ్రీన్ కొనసాగనున్నారు. కాగా, ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఆ పాటలో వెంకీ, వరుణ్ తో కలిసి చిందులేయనుందట ప్రగ్యా జైశ్వాల్.
అంతేకాదు.. ఈ డ్యాన్స్ నంబర్లో మరో భామ సోనాల్ చౌహాన్ కూడా ఉంటుందని టాక్. కాగా, ఇప్పటికే వరుణ్‌తో 'కంచె'లో కలిసి నటించిన ప్రగ్యాకి.. వెంకీతో మాత్రం ఇదే మొదటి సినిమా. త్వరలోనే 'ఎఫ్ 3'లో ప్రగ్యా ఎంట్రీపై క్లారిటీ రానుంది. 'ఎఫ్ 3'కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
Also Read