ఐటీ దాడులు: విజయ్‌కు సేతుపతి మద్దతు!
on Feb 12, 2020

తమిళ స్టార్ట్ యాక్టర్ విజయ్, 'బిగిల్' మూవీ ప్రొడ్యూసర్స్‌పై ఇటీవలి ఇన్‌కం టాక్స్ దాడులకు సంబంధించి వస్తున్న వదంతులను మరో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఖండించాడు. 'విజయ్‌పై ఐటీ దాడుల వెనుక కీలక నిజాలు' పేరుతో ఉన్న ఒక నోట్‌ను బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సేతుపతి, 'గెట్ ఎ లైఫ్' అనే అర్థం వచ్చేలా తమిళంలో కామెంట్ పెట్టాడు. సేతుపతి షేర్ చేసిన నోట్‌లో విజయ్‌పై వెరిఫై చేయని ఆరోపణలున్నాయి. కోలీవుడ్‌లోని టాప్ స్టార్స్ సంపన్న క్రిస్టియన్ మిషనరీలతో చేతులుకలిపి సినిమావాళ్లను క్రైస్తవమతంలోకి మార్చడానికి కుట్రచేస్తున్నారనేది ఆ నోట్‌లోని సారాంశం. విజయ్ సేతుపతి కూడా ఈ కుట్రలో భాగం పంచుకుంటున్నాడని కూడా ఆ నోట్ ఆరోపించింది. సంతకం చేయని ఈ నోట్‌పై, అది విషం చిమ్ముతూ చేసిన ఆరోపణలపై సేతుపతి తీవ్రంగా స్పందించాడు.
సేతుపతి ప్రస్తుతం విజయ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మాస్టర్' మూవీలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. నైవేలిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇన్‌కం టాక్స్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా చెన్నైలోని తన ఇంటికీ, నైవేలీకి మధ్య చక్కర్లు కొడుతూ వస్తున్నాడు విజయ్. 'బిగిల్' ప్రొడ్యూసర్ అయిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్, అన్బు చెలియన్ ఇళ్లు, కార్యాలపైనా ఐడీ దాడులు జరిగాయి.
"మా శోధనలో పెద్ద సంఖ్యలో ఆస్తి పత్రాలు, ప్రామిసరీ నోట్లు, పోస్ట్-డేటెడ్ చెక్స్ వంటివి దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. పరిశీలన సందర్భంగా గుర్తించిన ఆధారాల మేరకు ఈ కేసులో దాచిన ఆస్తులు, నగదు విలువ రూ. 300 కోట్లు దాటుతుందని అంచనా వేశాం" అని ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అయితే ఈ కేసుతో విజయ్‌కు సంబంధం ఉన్నట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలనూ ఐటీ అధికారులు ప్రకటించలేదు. ఓ వైపు ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగుతున్నా, విజయ్ ఏమాత్రం చలించలేదు. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న 'మాస్టర్' మూవీ షూటింగ్‌పైనే అతను తన దృష్టంగా నిలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



