కన్నడలో సురభి లక్ ఎలా ఉంటుందో?
on Feb 12, 2020
.jpg)
అదృష్టం ఏమాత్రం కలసిరాని హీరోయిన్లలో సురభి ఒకరు. ఆమెకు తెలుగులో హిట్ సినిమాలు లేవా? అంటే ఉన్నాయి. నాని డ్యూయల్ రోల్ చేసిన 'జెంటిల్మెన్'లో ఒక హీరోయిన్ గా చేసింది. శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా'లో ఆమె సోలో హీరోయిన్. సందీప్ కిషన్ తో చేసిన బీరువా ఒక్కటే ఫ్లాప్. అయితే... ఎందుకో ఆమెకు అవకాశాలు రాలేదు. అలాగని టాలెంట్ లేదా? అంటే అదీ కాదు. చక్కగా నటిస్తుంది. అందం లేదా? అంటే అదీ కాదు. తమన్నా తరహాలో తెల్లగా ఉంటుంది. ఆమెను మిల్క్ బ్యూటీ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఆమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం అదృష్టం లేకపోవడమే అనుకోవాలి. ఆ మధ్య తమిళంలో కూడా సినిమాలు చేసింది. ఇప్పుడు కన్నడలో లుక్ ఎలా ఉందో ట్రై చేసుకుంటోంది.
కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ సరసన నటించే అవకాశం సురభికి వచ్చింది. ఇంతకు ముందు గణేష్ తో చమక్ అని ఓ సినిమా తీశాడు దర్శకుడు సుని. అందులో రష్మిక హీరోయిన్. ఆ హిట్ తర్వాత గణేష్, సుని కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. అందులో సురభి హీరోయిన్. అక్కడైనా హిట్ సినిమాలతో పాటు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



