మోక్షజ్ఞ పైనే దృష్టి పెట్టిన ఫ్యాన్స్
on Feb 12, 2020

హీరోగా ఆయన ఎంట్రీ కోసం వెయిటింగ్
శిక్షణ వైపు అడుగులు వేస్తున్న మోక్షజ్ఞ
బాలకృష్ణ తరువాత ఆయన వారసుడిగా వెండితెరపై మోక్షజ్ఞ సందడి చేస్తాడని అంతా భావించారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకి నటన పట్ల ఆసక్తి లేదనే టాక్ ఆ మధ్య వినిపించింది. ఆయనకి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడం .. అందులో మోక్షజ్ఞ చబ్బీగా ఉండటం చూసి, ఇక ఆయనకి యాక్టింగ్ వైపు వచ్చే ఆలోచన లేదని అనుకున్నారు.
కానీ నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనని న్యూయార్క్ పంపించనున్నట్టు తెలుస్తోంది. 'న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్'లో శిక్షణ నిమిత్తం ఆయనను పంపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టార్ హీరోల కిడ్స్ చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



