అది చాలా చిన్న ఆఫర్: విజయ్ దేవరకొండ
on Jun 22, 2021
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్ కి పైగా లైక్స్ సాధించి సౌత్ లోనే మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్ గా నిలిచింది. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు పూరి-విజయ్ ల కాంబోలో వస్తున్న మూవీపై ఎంత క్రేజ్ ఉందో.
లైగర్ సినిమాకి తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి క్రేజీ ఆఫర్ వచ్చిందట. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. ఈ ఆఫర్ కి లైగర్ టీం కూడా ఓకే చెప్పడానికి సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. అయితే విజయ్ మాత్రం ఈ ఆఫర్ చాలా చిన్నదని అంటున్నాడు.
'లైగర్'కి రూ.200 కోట్ల ఆఫర్ వార్తల నేపథ్యంలో విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఆ న్యూస్ ని పోస్ట్ చేస్తూ.. "ఈ ఆఫర్ చాలా తక్కువ. నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాను" అని విజయ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ని బట్టి చూస్తే లైగర్ పై విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్థమవుతోంది. మరి ఈ లైగర్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read