'సరైన టైమ్‌లో మీకు తెలుస్తుంది'!
on Oct 13, 2022

సుదీర్ఘ కాలం సహజీవనం తర్వాత లేడీ సూపర్‌స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత ఈ నెల 9న వారికి సరోగసీ ద్వారా కవల పిల్లలు పుట్టారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విఘ్నేశ్ వెల్లడించాడో, అప్పట్నుంచీ రకరకాల విమర్శలు వస్తున్నాయి. సరోగసీ చట్టాన్ని వారు ఉల్లంఘించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విఘ్నేశ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రెండు పోస్టులు పెట్టాడు. ఒక దానిలో, "మీ గురించి పట్టించుకొనే వారిపైనే దృష్టి పెట్టండి. వారెప్పుడూ మీతో ఉంటారు. మీతో ఎవరు బాగా ఉంటారో, వారే మీ కోసం ఉంటారు" అని రాసిన అతను, ఇంకో పోస్టులో, "అంతా సరైన టైమ్‌లో మీకు అందుతుంది. అప్పటివరకూ ఓపిగ్గా ఉండండి. కృతజ్ఞతలు" అని రాసుకొచ్చాడు.
మనదేశంలో అమలులోకి వచ్చిన సరోగసీ చట్టం ప్రకారం...
1. దంపతులకు పెళ్లయి 5 ఏళ్లు పూర్తి కావాలి.
2. దంపతులలో ఒకరు బిడ్డను కనడానికి అనర్హులై ఉండాలి.
3. అద్దె తల్లి 16 నెలల బీమా తీసుకోవాలి.
4. ఒక స్త్రీ ఒక్కసారి మాత్రమే సరోగసి తల్లి కాగలదు.
5. దగ్గరి బంధువులు మాత్రమే సరొగేట్‌లుగా ఉండాలి.
6. దంపతులకు, అద్దె తల్లికి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



