ఆ అమ్మాయి అచ్చు సిల్క్ స్మిత లాగే ఉంది!
on May 21, 2020
.jpg)
1980, 90 దశకాల్లో ప్రేక్షకుల ఆరాధ్య తారల్లో సిల్మ్ స్మిత ఒకరు. ఆ కాలంలో టాప్ హీరోయిన్లతో సమానమైన ఇమేజ్ కలిగిన వ్యాంప్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క స్మితే. తెలుగులో ఆమె స్థానాన్ని భర్తీ చేసే తార మరొకరు ఇంతవరకూ రాలేదు. తనకే ప్రత్యేక్షకమైన డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఆకట్టుకొనే ఆమె, తన మత్తు కళ్లతో ప్రదర్శించే హావభావాలతో మగాళ్లను చిత్తు చేసేది. తన నటనతోనూ ఆమె ఎన్నో సినిమాల్లో ఆకట్టుకోవడం మనకు తెలుసు. ఆ కాలంలోని టాప్ హీరోలందరితో కలిసి ఆమె నటించింది. తాజాగా ఆమె లాగా కనిపిస్తోన్న ఒకమ్మాయి వీడియో సోషల్ మీడియాలో విరివిగా చలామణీలోకి వస్తోంది.
ప్రొఫైల్ ప్రకారం తార అనే పేరున్న ఆమె, స్మిత పోలికలతో కనిపించడమే కాకుండా, స్మితను అనుకరిస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చెప్పిన డైలాగ్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. స్మిత నటించిన మలయాళం మూవీ 'స్పడికమ్'కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆమె ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. 1995లో వచ్చిన ఆ మూవీని భరతన్ డైరెక్ట్ చేశాడు. మలయాళంలోని ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా 'స్పడికమ్' పేరు పొందింది.
గమనించాల్సిన విషయమేమంటే, ఇటీవలే ఆ సినిమా నిర్మాతలు 'స్పడికమ్'ను డిజిటల్‌గా రీమాస్టరింగ్ చేసి, మళ్లీ విడుదల చేస్తామని వెల్లడించడం. ఆ మూవీ విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా, దాని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పడు తార అనే అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ, సిల్క్ స్మిత పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



