అవార్డు వేలం వేస్తున్న దర్శకుడు
on May 21, 2020

'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' చిత్రానికిగాను 2013లో తనకు వచ్చిన ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డును దర్శకుడు అనురాగ్ కశ్యప్ వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ ఎవరెవరికి సోకిందో తెలియాలంటే టెస్టులు చేయాలి. టెస్టులు చేయడానికి తగిన కిట్స్ లేని కారణంగా కొన్ని చోట్ల చేయలేకపోతున్నారు. కరుణ వైరస్ టెస్ట్ కిట్స్ కొనుగోలు చేయడానికి డబ్బులను సమకూర్చడానికి తన అవార్డును వేలం వేయాలని అనురాగ్ కశ్యప్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు.
'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' సిరీస్ తో పాటు 'బొంబాయ్ టాకీస్', 'దేవ్ డి', 'గులాల్', 'ముంబై కటింగ్', 'బ్లాక్ ఫ్రైడే', 'నో స్మోకింగ్' తదితర చిత్రాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్లో 'బాంబే వెల్వెట్' భారీ బడ్జెట్ సినిమా. రణబీర్ కపూర్ అనుష్క శర్మ జంటగా నటించిన సినిమా ఫ్లాప్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ సత్య చిత్రానికి స్క్రిప్ట్ విభాగంలో అనురాగ్ కశ్యప్ పనిచేశారు. దక్షిణాదిలోనూ ఆయన సినిమాలు చేశారు. నయనతార ప్రధాన పాత్రలో నటించగా తెలుగులో 'అంజలి సిబిఐ ఆఫీసర్'గా అనువాదమైన తమిళ చిత్రం 'Imaikka Nodigal'లో ఆయన విలన్ పాత్ర పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



