మెగాస్టార్ ప్రాజెక్ట్ కి బ్రేక్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్!
on Nov 6, 2022

డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్నట్టు గతేడాది ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు డైరెక్టర్ వెంకీ మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు కూడా న్యూస్ వినిపించింది. ఇక తాజాగా యంగ్ హీరో నితిన్ తో ప్రాజెక్ట్ ఓకే అయినట్టు టాక్.
'ఛలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకొని, ఇక రెండో సినిమా 'భీష్మ'తో అంతకుమించిన విజయాన్ని అందుకున్నాడు. దీంతో మూడో సినిమాకే ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే స్క్రిప్ట్ నచ్చకపోవడమో లేక మరేవైనా కారణాల వల్లనో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడంతో వెంకీకి భారీ షాక్ తగిలింది. దీంతో తన రెండో సినిమా 'భీష్మ' హీరో నితిన్ తోనే.. మూడో సినిమా చేయడానికి వెంకీ సిద్ధమైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఖరారు అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరి 'భీష్మ'తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచి భారీ విజయాన్ని అందుకున్న వెంకీ-నితిన్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



