'ఎన్టీఆర్ 30' నుంచి కీలక అప్డేట్ వచ్చింది!
on Nov 6, 2022

'ఎన్టీఆర్ 30' ఎప్పుడెప్పుడు మొదలవుతుందా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవ్వడం, ఎలాంటి అప్డేట్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో సినిమా త్వరగా స్టార్ట్ చేయాలని, లాంచ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆనందపడే న్యూస్ వచ్చింది.
'ఎన్టీఆర్ 30' ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి డైరెక్టర్ కొరటాల శివతో కలిసి డీవోపీ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ కృషి చేస్తున్నారని చెబుతూ తాజాగా మేకర్స్ కొన్ని ఫోటోలు వదిలారు. ఆ ఫొటోల్లో కొరటాల, రత్నవేలు, సాబు సిరిల్ ఉన్నారు. తాజా అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



