విశ్వక్ సేన్ పై సీనియర్ హీరో అర్జున్ షాకింగ్ కామెంట్స్!
on Nov 5, 2022

యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. విశ్వక్ సేన్ తీరు పట్ల సీనియర్ హీరో, దర్శకుడు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. కథ నచ్చి, అన్ని మాట్లాడుకున్న తర్వాత ప్రతిసారి షూటింగ్ కి రాకుండా ఏవో సాకులు చెబుతున్నాడని ఆయన అన్నాడు. ఇప్పుడు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని, ఆయన కారణంగా సీనియర్ నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయని అర్జున్ చెప్పుకొచ్చాడు.
విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా గ్రాండ్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టాడు. ఈ సినిమా ద్వారా తన కుమార్తె ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్నాడు అర్జున్. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన్ అర్జున్, విశ్వక్ సేన్ తీరుని తప్పుబట్టాడు.
"నేను చెప్పిన కథ విశ్వక్ సేన్ కి నచ్చింది. రెమ్యునరేషన్ విషయంలోనూ ఆయన చెప్పిన విధంగానే అగ్రిమెంట్ జరిగింది. కానీ కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తెలీదు. నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు. కేరళలో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఆర్టిస్ట్ గా అతని పరిస్థితి అర్థం చేసుకొని ఆ షెడ్యుల్ క్యాన్సిల్ చేశాం. ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు.. అయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు.. వాళ్లకు ఏమి తక్కువ?. మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెబుతున్నాను. ఇలాంటి వాతావరణంలో నేను అతనితో సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను" అని అర్జున్ అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



