త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్
on Jun 9, 2018

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాటలతోనే కాదు దర్శకత్వంతో కూడా ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడు.. అయితే త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేసినా.. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.. ఆ సినిమాతో త్రివిక్రమ్, వెంకటేష్ చేసిన మాయ అంతా ఇంత కాదు.. ఇప్పటికీ ఆ సినిమా వస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతాం.. అలానే వీరి కలయికలో వాసు, మల్లీశ్వరి సినిమాలు కూడా వచ్చాయి.
అయితే వెంకటేష్ తో చేసిన ఈ సినిమాలు అన్నింటికీ త్రివిక్రమ్ రచయితగానే పని చేసాడు.. తన మార్క్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.. ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా వస్తే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.. త్వరలో ఫ్యాన్స్ ఆశ, ఆనందంగా మారబోతుంది.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ప్రస్తుతం తారక్ తో 'అరవింద సమేత' సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. తరువాత సినిమాని వెంకటేష్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కి పండగే...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



