కళ్యాణ్‌రామ్ నుంచి రామ్ వచ్చిన ఛాలెంజ్
on Jun 8, 2018
హీరో, విలన్ కి ఛాలెంజ్ విసరడం తెల్సు గాని.. హీరో, హీరోకి ఛాలెంజ్ విసరడం ఏంటి అనుకుంటున్నారా.. చిన్న మెలిక ఉందిలేండి.. ప్రస్తుతం మన దేశంలో ఫిట్నెస్ ఛాలెంజ్ అంటూ సెలబ్రిటీలు ఒకరినొకరు ఛాలెంజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ ఛాలెంజ్ మన టాలీవుడ్ ని కూడా తాకింది.. మోహన్ లాల్, ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరారు.. మరి ఎన్టీఆర్ ఊరుకుంటారా? జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి మహేష్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ లకు ఛాలెంజ్ విసిరారు.. అలా ఛాలెంజ్ కాస్తా కళ్యాణ్ రామ్ ద్వారా రామ్ దగ్గరికెళ్ళింది.. అయితే రామ్ జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. సెలెబ్రిటీలకి కాకుండా వెరైటీగా ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసిరారు.. రామ్ విసిరిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ కి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.