మరో మూడు నెలలు రెస్ట్‌లోనే వెంకటేష్
on Aug 28, 2020

విక్టరీ వెంకటేష్ మరో మూడు నెలలు రెస్ట్ తీసుకోనున్నారు. గతేడాది సంక్రాంతికి 'ఎఫ్ 2'తో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన, ఆ తరవాత చిన్న బ్రేక్ తీసుకుని 'వెంకీ మామ' చేశారు. ఆ తరవాత 'నారప్ప' షూట్ స్టార్ట్ చేశారు. రీమేక్ సినిమా కావడంతో స్పీడుగా షూటింగ్ కంప్లీట్ చేయవచ్చని నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితే, ప్లానింగ్‌కి కరోనా బ్రేకులు వేసింది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగా కరోనా రావడంతో వెంకీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.
"మా సంస్థలో తీస్తున్న సినిమాల షూటింగ్‌లు స్టార్ట్ చేయడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది" అని వెంకటేష్ అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు స్పష్టం చేశారు. 'నారప్ప'కు ఆయన కూడా ఒక నిర్మాత. అందువల్ల, మరో మూడు నెలలు వెంకటేష్ రెస్ట్‌లో ఉండనున్నారు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలుపుకుంటే 'నారప్ప'లో 100 నుండి 150 మంది బృందంతో తీయాల్సిన సీన్లు, ఫైట్లు ఉన్నాయట. అందుకని, ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకోవడం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



