ENGLISH | TELUGU  

త్వరలో 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ విన్నర్ పెళ్లి

on Aug 28, 2020

తమిళ 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ విన్నర్ ఆరవ్ నఫీజ్ పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన యాక్షన్ థ్రిల్లర్ 'జాషువా ఇమై పోల్ కక్కా'తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్న రాహీని అతడు పెళ్లి చేసుకోనున్నాడు. ఆమె అతడి గాళ్ ఫ్రెండ్. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. 

'బిగ్ బాస్' ద్వారా ఆరవ్ నఫీజ్ వెలుగులోకి వచ్చాడు. ఆ షోలో హీరోయిన్ ఓవియా అతడిపై ప్రేమను వ్యక్తం చేసింది. అయితే, అతడు ప్రేమ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. తాను రిలేషన్షిప్‌లో ఉన్నాననీ, తనకొక గాళ్ ఫ్రెండ్ ఉందని హింట్ ఇచ్చాడు. ఆ షో మధ్యలో ఓవియా నిష్క్రమించినా ఆరవ్ కి సపోర్ట్ ఇచ్చింది. ఓవియా ఆర్మీ మద్దతుతో అతడు విన్నర్ అయ్యాడని కొందరు అంటుంటారు. షో తరవాత వాళ్లిద్దరూ లివ్-ఇన్ రిలేషన్షిప్‌లో ప్రచారం జరిగింది. అప్పుడు తాము స్నేహితులమే అని ఓవియా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు రాహీతో ఆరవ్ పెళ్లికి రెడీ అయ్యాడు. సెప్టెంబర్ 6న చెన్నైలో స్టార్ హోటల్ లో వీళ్ల పెళ్లి జరగనుందని సమాచారం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.