రియా చక్రవర్తి తల్లికి చేతబడి చేయడం తెలుసు!
on Aug 28, 2020

సుశాంత్ కేసు సిబిఐ దర్యాప్తులో ఉండగా... అతడి మరణానికి రియా చక్రవర్తి కారణమని వంద శాతం ఖచ్చితంగా ఒక స్థిరమైన అభిప్రాయానికి రావడం తప్పే. అయితే చాలామంది ఆమెను దోషిగా చూస్తున్నారు. సుశాంత్ కుటుంబం సైతం అతని మరణానికి కారణం ఆమేనని ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి విషం ఇచ్చి చంపిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. డ్రగ్స్ కోణం బయటపడింది.
కొత్తగా రియా చక్రవర్తి పొరుగింట్లో ఉండే ఒక మహిళ, సుశాంత్ మరణానికి చక్రవర్తి ఫ్యామిలీ కారణమని ఆరోపిస్తోంది. తనను తాను సుశాంత్ అభిమానిగా పేర్కొన్న ఆమె... చేతబడి చేయడం ద్వారా చంపి ఉంటారని చెబుతోంది. సుశాంత్ యూరప్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత రియా చక్రవర్తి ఇంట్లో మూడు నెలలు ఉన్నాడనేది ఆమె చెబుతున్న మాట.
"రియా చక్రవర్తి తల్లిని అడగండి. చేతబడి ఎలా చేయాలో చెబుతుంది. 100% సుశాంత్ హత్య చేయబడ్డాడు" అని రియా చక్రవర్తి పొరుగింట్లో ఉండే ఒక మహిళ టైమ్స్ నౌ ఛానల్ తో చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



