విక్టరీ వెంకటేశ్‌ను గర్వపడేట్లు చేసిన కుమార్తె ఆశ్రిత.. ఇన్‌స్టా రిచ్ లిస్ట్‌లో చోటు!
on Jul 5, 2021
సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత తండ్రిని గర్వపడేట్లు చేశారు. సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన ఆమె హాపర్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఈ లిస్టులో ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 19వ స్థానాన్నీ, గ్లోబల్ స్టార్ యాక్ట్రెస్ ప్రియాంకా చోప్రా 27వ స్థానాన్నీ పొందారు. ఇటీవల వ్యాపారవేత్త వినాయక్‌రెడ్డిని వివాహం చేసుకున్న ఆశ్రిత తన భర్తతో కలిసి స్పెయిన్‌లోని బార్సిలోనా సిటీలో నివాసం ఉంటున్నారు. ఆమె కంపెనీ 'ఇన్‌ఫినిటీ ప్లాటర్' ఫుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయింది.
హాపర్ డాట్ కామ్ ప్రచురించిన 2021 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377వ స్థానాన్నీ, ఆసియాలో 27వ స్థానాన్నీ పొందడం విశేషం. నిజానికి ఆశ్రితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోయర్ల సంఖ్య 1 లక్షా 40 వేలు మాత్రమే. మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నవాళ్లు సాధించలేని దాన్ని ఆమె సాధించడం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఎక్కువగా ఆమె రకరకాల ఫుడ్‌కు సంబంధించిన పోస్టులే ఎక్కువగా పెడుతుంటారు. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక ప్రమోషనల్ పోస్ట్ ద్వారా యావరేజ్‌న 400 డాలర్లు (రూ. 29,800) సంపాదిస్తున్నారు!
కాగా.. హాపర్ లిస్ట్ ప్రకారం విరాట్ కోహ్లీ ఒక ప్రమోషనల్ పోస్ట్ ద్వారా 680,000 డాలర్లు (సుమారు రూ. 5 కోట్లు), ప్రియాంకా చోప్రా 403,000 డాలర్లు (సుమారు రూ. 3 కోట్లు) ఆర్జించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
