`సలార్`లో నాని హీరోయిన్?
on Jul 5, 2021
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `ఆహా కళ్యాణం`(2014)లో కథానాయికగా అలరించింది ఢిల్లీ డాళ్ వాణీ కపూర్. దక్షిణాదిన ఆ ఒక్క చిత్రానికే పరిమితమైన ఈ ఉత్తరాది సోయగం.. `ఆహా కళ్యాణం`కి ముందు, తరువాత బాలీవుడ్ ప్రాజెక్టులే చేస్తోంది.
ఇదిలా ఉంటే.. దాదాపు ఏడేళ్ళ తరువాత వాణీ కపూర్ మరో దక్షిణాది సినిమాలో నటించబోతోందట. అయితే, ప్రాంతీయ చిత్రంలా కాకుండా పాన్ - ఇండియా మూవీలా ఈ సినిమా రూపొందుతోంది. ఆ చిత్రమే.. `సలార్`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చెన్నై పొన్ను శ్రుతి హాసన్ మెయిన్ లీడ్ గా నటిస్తోంది. సెకండ్ లీడ్ గా వాణీ కపూర్ నటించే అవకాశముందని సమాచారం. అదే గనుక నిజమైతే.. `ఆహా కళ్యాణం` తరువాత వాణీ కపూర్ నటించే రెండో దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే `సలార్`లో వాణి ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, వాణి నటించిన మూడు హిందీ చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమయ్యాయి. అక్షయ్ కుమార్ కి జంటగా నటించిన `బెల్ బాటమ్` ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అవుతుండగా.. రణ్ బీర్ కపూర్ కి జోడీగా నటించిన `షంషేరా` ఈ ఏడాదిలోనే జనం ముందుకు రానుంది. ఇక ఆయుష్మాన్ ఖురానా సరసన ఆడిపాడిన `చండీఘర్ కరే ఆషిఖీ` కూడా విడుదలకు ముస్తాబైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
