విద్యావ్యవస్థపై ధనుష్ అస్త్రం.. వెంకీ అట్లూరి చిత్రం!
on Jul 4, 2021
.jpg)
వైవిధ్యానికి పెద్దపీట వేసే తమిళ కథానాయకుల్లో ధనుష్ ఒకరు. ఒకవైపు రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్స్ చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ, పాత్రల్లోనూ అలరిస్తుంటారు ధనుష్. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా అడపాదడపా బాలీవుడ్ మూవీస్ లోనూ నటిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ స్టార్.. త్వరలో 'ద గ్రేమ్యాన్' అనే హాలీవుడ్ ప్రాజెక్టుతో మన ముందుకు రానున్నారు. అంతేకాదు.. తాజాగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ కమిట్ అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
కాగా, శేఖర్ కమ్ముల చిత్రంతో పాటు మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ ధనుష్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విద్యావ్యవస్థలోని లోపాలపై తిరుగుబాటు చేసే ఓ యువకుడి కథతో ధనుష్ - వెంకీ కాంబినేషన్ మూవీ తెరకెక్కనుందట. 1993 నాటి `జెంటిల్ మేన్`లో అర్జున్ పోషించిన పాత్రలా ఇందులోనూ ధనుష్ పాత్ర చాలా సీరియస్ గా, ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఆనంద్ ఎల్. రాయ్ డైరెక్షన్‌లో అక్షయ్ కుమార్, సారా అలీఖాన్‌తో కలిసి ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ 'అత్రంగి రే' మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతోంది. కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో చేస్తున్న తమిళ చిత్రం సెట్స్ మీద ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



