హిట్ యూనివర్స్‌లో వెంకీ కూడా భాగమవుతున్నారు!
on Dec 31, 2022

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వం మాస్క్ దాస్ విశ్వక్ సేన్ నటించిన ఇన్వెస్టిగేటివ్ థిల్లర్ చిత్రం హిట్ 1. ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఈ మూవీకి సీక్వెల్స్ చేయడం మొదలుపెట్టారు. హిట్ యూనివర్స్ సీక్వెల్స్‌ను తెరపైకి వస్తూనే ఉంటారని తేల్చి చెప్పారు. ఈ ఫార్ములాని ఫాలో అవుతూ రీసెంట్‌గా ఈ చిత్రం రెండో భాగం వచ్చి పెద్ద విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకొని పోతున్న అడవి శేషు నటించిన హిట్2 భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ ఖాతాలో చేరిపోయింది. నిర్మాతగా నానికి మంచి లాభాలను తెచ్చి పెట్టింది. దీనికి కొనసాగింపుగా హిట్3 ని చేయబోతున్నారు. ఇందులో నేచురల్ స్టార్ నాని స్వయంగా హీరోగా నటించి తన సత్తా చాటనున్నారు. దీనికి సంబంధించిన క్లూని హిట్2లోనే నాని ఎంట్రీ ద్వారా దర్శకుడు చూచాయగా ప్రేక్షకులకు తెలిపారు. విభిన్న కథలతో, విభిన్న హీరోలకు ఈ హిట్ యూనివర్స్ రూపొందనుంది.
ఈ నేపథ్యంలో హిట్3 ఎండింగ్‌లో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇప్పించి హిట్4ను వెంకటేష్ తో తీయాలని శైలేష్ కొలను ప్లాన్ చేస్తున్నారు. గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన కాకా ను అదే దర్శకుడైన గౌతమ్ వాసుదేవ మీనన్‌తో ఘర్షణ మూవీగా విక్టరీ వెంకటేష్ తీసి వావ్ అనిపించారు. డిసిపి రామచంద్రా అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన అదరగొట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన శైలేష్ కొలను రీసెంట్‌గా వెంకటేష్‌కు హిట్ 4 స్టోరీని ఆల్రెడీ వినిపించారని వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారని తెలుస్తోంది. దీంతో నాని నటించనున్న హిట్3 ఎండింగ్‌లో వెంకీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఆయన ఫ్యాన్స్ కు, ఆయన నుంచి యాక్షన్ చిత్రాలను ఆశించే వారికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



