అఫిషియల్: దంపతులు కాబోతున్న నరేశ్, పవిత్ర!
on Dec 31, 2022
.webp)
సీనియర్ నరేశ్, కన్నడ తార పవిత్రా లోకేశ్.. చాలా కాలంగా వార్తల్లో వ్యక్తులుగా ఉంటూ వస్తున్నారు. ఇద్దరూ తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొని, కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. నరేశ్, పవిత్ర ఆమధ్య బెంగళూరులో ఓ హోటల్లో ఉండగా, నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడకు పోలీసులతో కలిసివెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా పవిత్రను కాపురాలు కూల్చే మనిషిగా రమ్య ఆరోపించారు. అయితే ఇప్పుడు నరేశ్, పవిత్ర జంట తమ అనుబంధాన్ని అఫిషియల్‌గా ప్రకటించారు.
కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారు ఓ జంట. 2022 చివరి రోజున ఉద్వేగభరితంగా ఆలింగనం చేసుకుంటున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు నరేశ్. ఆ వీడియోలో చేతులు పట్టుకొని, తమకంగా ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు వారు. వారి చేతుల్లో షాంపేన్ గ్లాసులు కూడా ఉన్నాయి. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఆ వీడియోతో పాటు "కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభాలు.. మీ ఆశీస్సులు కావాలి.. మా నుంచి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - మీ పవిత్రా నరేశ్ అని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాశారు నరేశ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



