ఆ ఇద్దరు తెలుగు హీరోలపై మనసు పారేసుకున్న శ్రీదేవి గారాలపట్టి!
on Dec 31, 2022

అతిలోకసుందరి శ్రీదేవి టాలీవుడ్ లో నాటి ఎన్టీఆర్ నుంచి నిన్నటి నాగార్జున వరకు అగ్ర హీరోలందరి సరసన నటించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తరువాత ఆమె వారసురాలు జాన్వీకపూర్ టాలీవుడ్ తెరంగేట్రంపైన చాలా కాలంగా చర్చ సాగుతోంది. వాస్తవానికి శ్రీదేవి బతికున్నప్పుడే ఈ చర్చ కొనసాగింది. నాడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్లతో కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరినీ మరోసారి తీయాలని చర్చ కూడా సాగింది. అలా రీమేక్ గాని లేదా సీక్వెల్ గాని తీయాలని చర్చ సాగుతున్న సమయంలోనే శ్రీదేవి హఠాత్తుగా మరణించింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాకు జాన్వి పేరును పరిశీలించారని దానికి జాన్వి కూడా ఓకే చెప్పిందని కథనాలు వస్తున్నా అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
ఇంతలోనే జాన్వి తనకి ఎవరు అవకాశం ఇవ్వలేదని, ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ రాలేదని.... ఒకవేళ అవకాశం వస్తే నటిస్తానని కూడా మీడియాతో అన్నారు. తాజాగా ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని దాచుకోలేక బహిరంగంగా ఓపెన్ అయిపోయింది బాలీవుడ్ యువ సంచలనం జాన్వి కపూర్. ఆమె జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అట. గతంలో ఇదే విషయాన్ని చాలా సార్లు ధ్రువీకరించిన ఈ యువసంచలనం ఇప్పుడు మళ్లీ తన ప్రేమను కురిపించింది. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ జనతా గ్యారేజ్ చూశాను. నేను జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానిని. అతను ఒక అద్భుత నటుడు అని జాన్వి కితాబు ఇచ్చింది. ఇక తెలుగు హీరోలలో ఎవరితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది.
అల్లుఅర్జున్ తో నటించేందుకు ఇష్టపడతానని తెలిపింది. కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లతో పని చేయాలని ఉందని కూడా తన కోరికను బయట పెట్టింది. ఇక కొరటాల శివ- ఎన్టీఆర్ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభించుకొనుంది. ఈ చిత్రంతో జాన్వి టాలీవుడ్ డెబ్యూ ఖాయమని తెలుగు అభిమానులు బోలెడంత నమ్మకంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. ఒక వైపు ఇంకా పిలుపు రాలేదంటూనే జాన్వి కొరటాల, ఎన్టీఆర్లతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పడంతో ఇక ఆమె ఎంట్రీ లాంఛనమే అని అర్ధమవుతోంది. అందులో జాన్వికి అడిగినంత మొత్తం ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధపడుతున్నారని సమాచారం. ఇక ఆ మధ్య జాన్వి మాట్లాడుతూ తనకు తెలుగు హీరోలలో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పింది. కానీ తాజాగా ఆమె ఆ ప్రస్తావన తేలేదు. మరి ఎందుకని తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ దేవరకొండ కొండా సంగతి ప్రస్తావనకు తేలేదు అంటే బహుశా లైగర్ చిత్రం తర్వాత ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకుందేమో అని కొందరు జోక్ చేస్తున్నారు..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



