రికార్డు ఓపెనింగ్స్ దిశగా 'వీరసింహారెడ్డి'!
on Jan 11, 2023

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్, కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'అఖండ' నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డులను 'వీరసింహారెడ్డి' బ్రేక్ చేయనుందని అంటున్నారు. అందుకు తగ్గట్లే విడుదలకు ముందే 'వీరసింహారెడ్డి' రికార్డులు సృష్టిస్తోంది. యూఎస్ లో అడ్వాన్స్ ప్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిసి రికార్డు కలెక్షన్స్ రావడం ఖాయమని అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. మేజర్ సిటీలలో దాదాపు షోలు అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇప్పటిదాకా రూ.3.5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. దాదాపు అన్ని ఏరియాల్లోనూ జోరు కనిపిస్తోంది. బాలకృష్ణ గత చిత్రం 'అఖండ' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా.. 'వీరసింహారెడ్డి' రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



