ENGLISH | TELUGU  

అందుకే సమంతకు తెల్లని దుస్తులు.. జపమాల?

on Jan 11, 2023

హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు తెల్ల దుస్తులు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. ఇక క్రిస్టియన్స్ లో ఉండే నన్స్ గాని హిందువులలో బ్రహ్మకుమారి సమాజం, హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో పూర్తిగా లీన‌మైన  వారు వైట్ అండ్ వైట్ దుస్తులను ధరిస్తారు. ఇక హరే రామ హరే కృష్ణ వారి చేతిలో అయితే ఎప్పుడూ ఒక జపమాల ఉంటుంది. రోజుకి ఎన్ని వేలు ఎన్ని లక్షలు జపం చేయాలనే నిబంధన ఉంటుంది. దాని వలన మనశ్శాంతి, ఆరోగ్యం,దైవ శక్తి సహకరిస్తాయని వారి నమ్మకం. వాస్తవానికి సమంత విషయానికి వస్తే ఆమె స్వతహాగా క్రిస్టియన్ కానీ ఇటీవల ఆమె హిందూ మతం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు... ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విడాకులు తీసుకోవడం ఆమెను చాలా బాధించిందట. అదే సమయంలో ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధితో  బాధపడుతోంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుండి ఆమె  కోలుకుంటోంది.

ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్‌లో కూడా ఈమె వైట్ అండ్ వైట్ దుస్తుల్లో చేతిలో జపమాలతో కనిపించింది.  ఆమెలో  ఈమధ్య బాగా ఆధ్యాత్మిక చింతన పెరిగిందట. హిందూమతం కూడా పుచ్చుకొని హిందూ ధర్మం ప్రకారం దైవచింతన్‌లో మునిగిపోతుందని తద్వారా మానసిక ప్రశాంతతను కోరుకుంటుందని టాలీవుడ్ లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇక విడాకుల త‌ర్వాత చాలా మంది స‌మంత‌ను టార్గెట్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ వీరాభిమానులు, ముఖ్యంగా నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ నుంచి ఆమె దారుణ‌మైన ట్రోల్స్‌ను ఎదుర్కొంది. నాగ‌చైతన్య‌ను మంచివాడిగా నిరూపించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఆమె ఈ ర‌క‌మైన కామెంట్స్ చేశార‌ని, ఓ వ‌ర్గం వారు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ స‌మంత‌ను ఇబ్బందిక‌రంగా, అస‌భ్యంగా తూల‌నాడార‌నే అభిప్రాయం కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఓ వ‌ర్గం ప‌నిగ‌ట్టుకుని మ‌రీ స‌మంత‌ను టార్గెట్  చేశార‌ని వారి భావ‌న‌. ఇందుకోసం వారు స‌మంత వివాహానికి పూర్వ చ‌రిత్ర‌ను మ‌ర‌లా త‌వ్వి తీసి, ఆమె చాలా మందితో ఎఫైర్స్ న‌డిపింద‌ని, సిద్దార్ధ్ తో స‌హా ఆమెకు ప‌లువురితో ఎఫైర్లు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌వ్వి తీశారు.

అవి నిజ‌మో కాదో తెలియ‌క‌పోయినా స‌మంత‌ను మాన‌సికంగా కృంగ‌దీశాయ‌ని, దాంతో ఆమె మ‌న‌శ్శాంతికి దూర‌మైంద‌ని అనేవారు ఉన్నారు. ఆమె స్వేచ్చాయుత జీవితాన్ని కోరుకుంటుంద‌ని, ఆమెకు ప్ర‌కృతి ప్ర‌సాదించిన అమ్మ‌త‌నం కూడా ఇష్టం లేదని, పిల్ల‌ల‌ను క‌న‌డం ఆమెకి ఇష్టం లేద‌ని కొంద‌రు ప్ర‌చారం చేశారు. నిజం ఏదైనా న‌ష్ట‌పోయింది మాత్రం స‌మంతానే. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం ఆమె విడాకుల అనంత‌రం ఆధ్యాత్మిక యాత్ర‌ను కూడా చేసి వ‌చ్చింది. ఆధ్యాత్మిక గురువుల‌ను క‌లిసి మ‌న‌శ్శాంతికి మార్గాల‌ను వెతికింది.  ప‌లు ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను చ‌దివింది. ఇలా సాగిన ఆమె జీవితం ప్ర‌స్తుతం తెల్ల‌ని వ‌స్త్రాలు, జ‌ప‌మాల వ‌ర‌కు తీసుకుని వ‌చ్చాయ‌ని ఆమెని బాగా ఎరిగిన వారు అనే మాట‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.