రీమేకులతో పోలిస్తే ఫ్రీమేక్‌లే ముద్దు!
on Jan 11, 2023

సినిమాల విషయానికి వస్తే రీమేకుల కంటే ఒక భాషలో హిట్ అయిన సినిమాని తీసుకొని అందులోని సోల్ పాయింట్ ను పట్టుకొని దానికి చుట్టూ సరికొత్త కథను అల్లగలిగితే సరికొత్త కథగా అది ప్రేక్షకులను అల్లరించగలదు. ఉదాహరణకు ఏమి రాని స్టూడెంట్ పరీక్షల్లో బాగా చదివే ముందు బెంచ్ స్టూడెంట్ పేపర్ నుంచి అన్ని ప్రశ్నలకు జవాబులు కాపీ కొట్టే కంటే చుట్టూ ఉన్న బాగా చదివే వారి నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కో ప్రశ్నకు సమాధానం తీసుకుని అందరి పేపర్ల నుంచి ఒక్కో ఆన్సర్ కాపీ కొడితే అసలు చదివిన తెలివైన వారి కంటే కాపీ కొట్టిన వాడికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం బాగా ఉంటుంది.
అలాగే ఒకే మంచి సినిమా రీమేక్ హక్కులు కొనుక్కుని పూర్తిగా ఆ సినిమానే రీమేక్ చేయకుండా పది మంచి చిత్రాల నుంచి పది మంచి పాయింట్లు తీసుకుని ఆయా సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్తగా తీయగలిగితే ఆ మజానే వేరు. సినిమా కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. అలాంటి చిత్రాలను కొత్తదనం నిండిన చిత్రంగా బాగా ప్రచారం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. సినిమాకు కచ్చితంగా గ్యారెంటీ హిట్టనే ఒక మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ కు నిర్మాతలకు రీమేకుల కోసమని కోట్లకు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకనాడు రీమేక్లు తప్పని పరిస్థితి ఉండేది. ఒక భాషలో మంచి హిట్ అయిన సినిమాను అన్ని భాషల వారు కొనుగోలు చేసి రీమేకులు చేసి హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చంటి, పెదరాయుడు వంటివి నిన్న మొన్నటి వారికి కూడా బాగానే గుర్తుంది ఉంటాయి. ఇవన్నీ రీమేక్లే. ఒకనాడు చాలామందిని రీమేక్ హీరోలు, రీమేక్ దర్శకులు అని కూడా అనేవారు. రీమేక్ సినిమాలు ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీ హిట్స్ గా కూడా నిలిచాయి. ఇండస్ట్రీలోని హీరోలందరూ ఇలాంటి రీమేక్ లలో నటించిన వారే.
కానీ ప్రస్తుతం రీమేకులకు గడ్డుకాలం నడుస్తుంది. ఓటీటీల వల్ల రీమేకులు లకు ఉండే డిమాండ్ బాగా తగ్గింది. ఒక భాషలో విడుదలైన సినిమాలు అన్ని భాషల్లో కూడా సబ్ టైటిల్స్ తో ప్రేక్షకులు ఓటీటీలో చూస్తున్నారు. దాంతో వాటిని రీమేకులు చేస్తే జనాలు లైట్గా తీసుకుంటున్నారు. అందుకే రీమేక్ పేరుతో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కాస్త ఓ హిట్ సినిమా సోల్ పాయింట్ తీసుకుని దానికి మనదైన శైలిలో హంగులు చేకూరిస్తే జనాల నుండి ఆదరణ లభిస్తుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి.. ఇప్పుడు పవన్ తేరి సినిమా కూడా అలాగే రూపొందుతోంది. సోల్ పాయింట్ తీసుకొని గబ్బర్ సింగ్ తరహాలో దబాంగ్ చాయలు పడకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి బ్లాక్ బస్టర్ ను హరీష్‌శంకర్ అందుకున్నారు. అదే ఉత్తమమని ఇప్పుడు చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సమంత మలయాళం లో సూపర్ హిట్ అయినా జయ జయ జయహే సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేసింది. ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన లవ్ టుడే ను బాలీవుడ్ లో వరుణ్ దామన్ రీమేక్ చేయాలని ఆశపడుతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా విచ్చలవిడిగా ఓటీటీలో పోటీ పడి ప్రదర్శింపబడి సూపర్ హిట్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని రీమేక్ చేస్తే జనాలు పట్టించుకుంటారా అనేది అనుమానమే....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



