‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ గర్జన.. ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!
on Jan 13, 2023

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. మొదటిరోజు కలెక్షన్స్ పరంగా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.
'వీరసింహారెడ్డి' విడుదలకు ముందు ఏర్పడిన క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా రూ.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. మొదటిరోజే ఏకంగా 42 శాతం రికవరీ చేయడం విశేషం. మొదటిరోజు నైజాంలో రూ.6.21 కోట్ల షేర్, సీడెడ్ లో రూ. 6.55 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.12.59 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.25.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.75 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.3.95 కోట్ల షేర్ కలిపి.. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.31.05 కోట్ల షేర్ సాధించని ట్రేడ్ వర్గాల సమాచారం.
.webp)
ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా వచ్చాయి. పైగా ఇది సంక్రాంతి పండగ సీజన్ కావడంతో.. ఇదే జోరు కొనసాగితే 'వీరసింహారెడ్డి' మొదటి వారంలోనే బ్రేక్ సాధించి ఘన విజయాన్ని నమోదు చేస్తుందనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



