'వాల్తేరు వీరయ్య'.. జంబలకిడి జారు మిఠాయ!
on Jan 13, 2023

'జంబలకిడి జారు మిఠాయ' అనే పాట కొద్దిరోజులుగా సోషల్ మీడియాని ఎంతలా ఊపేస్తుందో తెలిసిందే. చిత్తూరు జిల్లాలో పాడుకునే ఈ జానపద పాటను మంచు విష్ణు నటించిన 'జిన్నా' సినిమాలో పెట్టారు. అయితే సినిమాలోని సాంగ్ కంటే.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహిళ పాడిన పాటే బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. అయితే ఇప్పుడు ఈ పాటను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పాడటం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చిరు వింటేజ్ కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి తనదైన కామెడీతో అలరించారు. మెగాస్టార్ అనే ఇమేజ్ ని పక్కన పెట్టి.. ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయిన కంటెంట్ తో కూడా నవ్వించారు. 'జంబలకిడి జారు మిఠాయ' పాటకు పేరడీగా "నేను లుంగీ కడతా చూడు.. నేను లుంగీ కడతా చూడు.. నా లుంగీ సైడ్ చూడకుంటే తీసేస్తా చూడు" అంటూ పాడి చిరు నవ్వులు పూయించాడు.
అలాగే "ఎందుకు పుడతారో తెలీదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతిదశలోనూ పెంట పెంట చేసేస్తున్నారు" అంటూ ఓ న్యూస్ రీడర్ ఫ్రస్టేట్ అయిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఆ డైలాగ్ ని కూడా చిరు తన స్టైల్ లో చెప్పి నవ్వించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



