సంక్రాంతి సినిమాలు.. సగం సగం వినోదం!
on Jan 13, 2023

ఈ సంక్రాంతికి తెలుగులో రెండు పెద్ద సినిమాలు, తమిళ్ లో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ నాలుగు సినిమాలలో ఏదీ కూడా పూర్తిస్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేదు. అన్నీ యావరేజ్, ఎబో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. అయినప్పటికీ పండగ సెలవలు కావడం, అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వెళ్తుండటం అనేది కలిసొచ్చే అంశం.
ముందుగా జనవరి 11న తమిళ సినిమాలు 'తునివు', 'వారిసు' విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. 'తునివు' సినిమా 'తెగింపు' పేరుతో తెలుగులో కూడా 11వ తేదీనే విడుదలైంది. ఇక్కడా యావరేజ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇక 'వారిసు' సినిమా 'వారసుడు' పేరుతో తెలుగులో రేపు(జనవరి 14న) విడుదల కానుంది. మరి తెలుగులో ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇక టాలీవుడ్ నుంచి నిన్న(జనవరి 12న) 'వీరసింహారెడ్డి', ఈరోజు(జనవరి 13న) 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ ని, మాస్ ని అలరించేలా ఉన్నాయనిపించుకున్నాయి కానీ.. పూర్తిగా హిట్ టాక్ ని మాత్రం తెచ్చుకోలేకపోయాయి. రివ్యూలు, పబ్లిక్ టాక్ లు ఎక్కువగా యావరేజ్ అనే రేంజ్ లోనే ఉన్నాయి. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాల వసూళ్ళకు డోకా ఉండదని చెప్పొచ్చు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. 'వాల్తేరు వీరయ్య' సైతం అదేస్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టనుందని అంచనా. మొత్తానికి సంక్రాంతి పెద్ద సినిమాలు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా కలెక్షన్లలో మాత్రం దూకుడు చూపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



