'ఫిదా 'చేస్తేనే సదా ఉంటాడు...లేదంటే అంతే..!
on May 18, 2017
.jpg)
వైవిధ్యమైన కథలతో వరస చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ తన తొలి సినిమా ముకుంద తో మంచినటుడిగా గుర్తింపుతెచ్చుకున్నాడు.ఇక జాతీయ భావాలనునింపే 'కంచె' చిత్రం ద్వారా విమర్శకులనుండి ప్రశంసలు అందుకున్నారు.కానీ ఈ చిత్రాలు భారీ విజయాన్ని ఇవ్వలేక పోయాయి.ఎంతో ఆశతో తన తర్వాత ప్రయత్నాలు మానకుండా విభిన్నంగా లోఫర్ చిత్రంతో వచ్చి అంతగా దూసుకెళ్లలేకపోయాడు.
తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'మిస్టర్ 'చిత్రం చేసి డిజాస్టర్ గా మిగిలిపోయాడు.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'ఫిదా 'చిత్రం తో రానున్నాడు.ఇప్పటికే విజయం లేక విసుగుతో ఉన్న ఈ మెగా హీరో అందరిని ఫిదా చేసి విజయాన్ని అందుకుంటాడో లేదో అని అనుకుంటున్నారు.ఈ చిత్రం ఆయన తర్వాత చిత్రాలకు వారధిగా మారబోతుంది.ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే మంచి అవకాశాలు వచ్చే వీలుంది లేదంటే ఆయన కెరీర్ అగమ్యగోచరమే అని టాలీవుడ్ గుస గుస లాడుతుంది.మరి ఫిదా చేస్తాడో ..లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



