ష్...! మెగా టైటిల్ మారబోతుంది..!!
on May 18, 2017
.jpg)
దశాబ్దకాలం దడ పుట్టించకుండా ఉండి,భారీ ఆరంగేట్రం తో బెంబేలు పుట్టించిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి .తన 150 వ చిత్రం 'ఖైదీ నెం 150 'తో అద్భుత విజయం అందుకొని అభిమానులలో సరికొత్త ఊపు ను నింపాడు.వెనువెంటనే తన 151 వ చిత్రాన్ని మొదలు పెట్టేసాడు.డైనమిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఖరారు అయినట్టుగా భావిస్తున్న 'ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ' టైటిల్ తో రాబోతున్నాడు.
ఈ పేరు ప్రస్తుతం సినీ జగత్తులో ప్రతి నోటా వినిపిస్తూనే ఉంది.ఈ చిత్రం తెలుగు ,తమిళ.మళయాళ ,కన్నడ ,హిందీ భాషలలో భారీ స్థాయిలో తీసేందుకు ప్రణాళికలు చేస్తున్న నేపథ్యం లో వాటికి సరిపోయే స్థాయిలో టైటిల్ ఉండాలని చిత్ర బృందం ఆలోచనల్లో పడిందని తెలుస్తుంది.ఈ చిత్ర నిర్మాణానికి అధునాతన సాంకేతిక బృందాన్ని బరిలో దించి నిర్మాత రామ్ చరణ్ తన సత్తాను జాతీయ స్థాయిలో చాటాలని ఉవిళ్లూరుతున్నాడని వినిపిస్తుంది.మరి చిరు కొత్త సినిమా టైటిల్ ఎలా ఉండబోతున్నది అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



