కింగ్ నాగార్జున కుటుంబంలో విషాదం
on May 18, 2017

అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది..నాగార్జున మేనల్లుడు హీరో సుశాంత్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచారు. అక్కినేని నాగార్జున సొదరి నాగసుశీల భర్త సత్య భూషణరావు. ఈయన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత అనుమోలు వెంకటసుబ్బారావు కుమారుడు. సత్య భూషణరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



