వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ డేట్ వెల్లడైంది!
on Jan 28, 2021

వరుణ్ తేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న 'గని' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమాని జూలై 30న విడుదల చేస్తున్నట్లు వరుణ్ స్వయంగా ప్రకటించాడు. గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను అతను షేర్ చేశాడు. పోస్టర్‌లో బాక్సర్ లుక్‌లో పంచింగ్ బ్యాగ్‌పై పంచ్ విసురుతున్న వరుణ్ కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్‌కు "Entering the ring this July! #GhaniOnJuly30th" అంటూ క్యాప్షన్ జోడించాడు.
గని అనే బాక్సర్ క్యారెక్టర్‌ను పోషించడం కోసం ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని రినాయిజన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ (మహేశ్ మంజ్రేకర్ కుమార్తె) నటిస్తోన్న ఈ మూవీలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. రెండు వరుస హిట్లు.. 'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేష్'.. తర్వాత వరుణ్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



