తమన్.. సమ్మర్ స్పెషల్
on Jan 28, 2021

క్రాక్ రూపంలో మరో సంక్రాంతి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు యువ సంగీత సంచలనం తమన్. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రాలతో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ చేతిలో డజను చిత్రాలున్నాయి. కాగా.. వీటిలో నాలుగు సినిమాలు ఈ సమ్మర్ లో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఈ వేసవిలో పలకరించనుండగా.. ఆ సినిమా కంటే ముందు కన్నడ చిత్రం యువరత్న రిలీజ్ కానుంది. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అదే రోజున (ఏప్రిల్ 1)న తెలుగులోనూ అనువాదం కానుంది. ఇక నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న టక్ జగదీష్ కూడా వేసవిలోనే వినోదాలు పంచనుంది. అలాగే.. నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఎటెంప్ట్ బీబీ3 కూడా సమ్మర్ సీజన్ లోనే ఎంటర్ టైన్ చేయనుంది.
మరి.. ఈ నాలుగు చిత్రాలతో తమన్ కి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



